ఫేస్ మాస్క్ నిబంధనలను ఉల్లంఘించిన 100 మంది పై చర్యలు

- April 19, 2020 , by Maagulf
ఫేస్ మాస్క్ నిబంధనలను ఉల్లంఘించిన 100 మంది పై చర్యలు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇళ్ల నుంచి బయటికి వచ్చే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని అధికారులు ఎంతగా చెప్పినా కొందరు ఆ సూచనలు పట్టించుకోవటం లేదు. వైరస్ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తూ మాస్కులు లేకుండానే యథేచ్చగా రోడ్ల మీదకు వస్తున్నారు. బహ్రెయిన్ లో మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న దాదాపు వంద మందిని అధికారులు పట్టుకున్నారు. మాస్కులు ధరించాలన్న నిబంధనలు పాటించని వారిపై తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ప్రధాన ప్రజా భద్రతా అధికారి లెఫ్టినెంట్ జనరల్ తరీఖ్ అల్ హస్సన్ వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని..వాటిని తప్పకుండా పాటించాలని ఆయన హెచ్చరించారు. వీలైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ఒకవేళ అత్యవసరంగా బయటికి వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన మరోసారి వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com