నేరేడు పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

- January 27, 2016 , by Maagulf
నేరేడు పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

నల్లగా నిగనిగలాడే నేరేడు పండు చూస్తే ఎవరికైనా.. తినేయాలనిపిస్తుంది. పులుపు, వగరు రుచుల సమ్మేళనమైన నేరేడు పండు తినడానికి ఇష్టపడని వారుండరు. నేరేడు పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అయితే నేరేడు పండు మాత్రమే కాదు.. ఇందులో ఉండే గింజలు మరింత అమోఘమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి.ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు-గొప్ప ప్రయోజనాలునేరేడు పండు గింజల్ని ఇకపై పారేయకండి. ఎందుకంటే.. ఈ గింజలకు షుగర్ వ్యాధిని తగ్గించే అద్భుతమైన గుణం ఉంది. ఇందులో ఆక్సాలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లంతో పాటు, ఎన్నో ఔషధ విలువలు ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగని వీటిని షుగర్ పేషంట్స్ ఉపయోగించడానికి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. సింపుల్ గా ఉపయోగించి.. మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..నేరేడు గింజల్ని మెత్తగా దంచి అన్నంలో కలుపుకుని తింటే.. ఆ ప్రభావం చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ లో మార్పులు చూడవచ్చు. ఈ చిట్కాను తరచుగా ఫాలో అవడం వల్ల.. మంచి పలితాలు పొందవచ్చు.మజ్జిగ, నేరేడు గింజలు కూడా మధుమేహంతో పోరాడటానికి చక్కగా సహకరిస్తాయి. నేరేడు సాధారణంగా వగరుగా, పుల్లగా ఉంటుంది. ఇక గింజలు తినాలి అంటే.. కాస్త ఇబ్బందికరమే. కాబట్టి వాటిని డైరెక్ట్ గా తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి నేరేడు గింజల్ని పేస్ట్ లా తయారు చేసి.. మజ్జిగలో కలిపి తీసుకుంటే.. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు.నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడి చేసి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూన్ మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే అతిమూత్రం కూడా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా మూడు సార్లు తీసుకోవడం ఇబ్బందిగా ఫీలయ్యేవాళ్లు నేరేడు 5నుంచి 10 గ్రాముల గింజల చూర్ణాన్ని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదా నేరేడు పండు గింజల పొడిని కాచి వడగట్టి తాగితే.. శరీరంలోని చక్కెర నిల్వల స్థాయి తగ్గుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com