కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి..
- April 20, 2020
కెనడాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా పోలీస్ అధికారి సహా 16 మందిని హతమార్చాడో దుండగుడు. ఈ ఘటన నోవా స్కోటియాలో జరిగింది. పోలీసు అధికారిలాగా మారువేషంలో ఉన్న ఓ ముష్కరుడు 16 మందిని హతమార్చాడు.. ఇది దేశ చరిత్రలో ఘోరమైన దాడిగా ప్రభుత్వం భావిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అనుమానిత షూటర్ కూడా చనిపోయాడని అధికారులు తెలిపారు. నోవా స్కోటియా లోని హాలిఫాక్స్ కు ఉత్తరాన 60 మైళ్ళు దూరంలో ఉన్న పోర్టాపిక్ పట్టణంలో మృతదేహాలను వెలికితీశారు.
కాల్పులు జరిపిన వ్యక్తి గాబ్రియేల్ వోర్ట్మన్ (51) గా పోలీసులు గుర్తించారు, అతను పోర్టాపిక్‌లో తాత్కాలికంగా నివసిస్తున్నట్లు భావిస్తున్నారు. అతను కాల్పుల సమయంలో పోలీసు యూనిఫాం ధరించి తన కారును పోలీస్ వాహనం లాగా తయారు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇక అతను ఎందుకు ఇలా చేశాడు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







