కువైట్:ఈ నెల 22న సమావేశం కానున్న మూన్ సైటింగ్ ప్యానెల్

- April 20, 2020 , by Maagulf
కువైట్:ఈ నెల 22న సమావేశం కానున్న మూన్ సైటింగ్ ప్యానెల్

కువైట్:పవిత్ర రమదాన్ మాసం సూచిక ఆకాశంలో నెలవంక కనిపించటం. ఈ నెలవంకను చూడటానికి రమదాన్ మూన్ సైటింగ్ కమిటీ ఈ నెల 22న బుధవారం సమావేశమవుతుందని కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. సుప్రీం జ్యూడిషియల్ కౌన్సిల్ హెడ్ యూసుఫ్ అల్ ముతావ, ఇస్లాం వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఫహద్ అల్-అఫాసీ సమాశానికి ఆధ్వర్యం వహిస్తారు. ఇదిలాఉంటే పౌరులు, ప్రవాసీయులు రంజాన్ నెలవంకను గమనించినట్లైతే 25376934 నెంబర్ కి ఫోన్ చేసి అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com