ఆదివారం 6,463 మంది మరణించారు:WHO
- April 20, 2020
ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 81 వేల 153 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించబడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. అలాగే 6,463 మంది మరణించారు. శనివారం కంటే ఆదివారం తక్కువ కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజులతో పోలిస్తే నాలుగు వేల తక్కువ కేసులు, 247 తక్కువ మరణాలు నమోదయ్యాయి. WHO ప్రకారం, ఐరోపాలో 1.1 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ సంక్రమణ భారిన పడ్డారు.
అదే సమయంలో, ఇక్కడ మరణాల సంఖ్య కూడా లక్షకు మించిపోయింది. కాగా WHO చీఫ్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రేసియస్ జి 20 ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కరోనాతో పోరాడుతున్న దేశాలకు సహాయం చేయాలని ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







