స్పెయిన్:2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
- April 20, 2020
మాడ్రిడ్:స్పెయిన్‌లో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకి అక్కడ కేసుల సంఖ్య బారీగా పెరుగుతోంది. స్పెయిన్ లో కరోనా బారిన పడినవారి సంఖ్య రెండు లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 4,266 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఒక్క రోజే కరోనా బారిన పడి 399 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 20,852కు చేరింది. ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులున్న రెండో దేశం స్పెయినే కావడం గమనార్హం. ప్రస్తుతం స్పెయిన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 200210కి చేరింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







