కోవిడ్ పై ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలకు స్ఫూర్తిగా ర్యాప్ సాంగ్ ను విడుదల చేసిన సీపీ సజ్జనార్
- April 20, 2020
సైబరాబాద్ : కోవిడ్ 19 కరోనా వైరస్ నివారణకు ముందు వరుసలో నిల్చొని కృషి చేస్తున్న వివిధ శాఖలైన వైద్యులు, పోలీసులు, మీడియా, పారిశుధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ భాస్యశ్రీ రచించి, ర్యాప్ రాక్ షకీల్ కంపోజ్ చేసి, ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ ఫేమ్ శ్రీరామ చంద్ర పాడిన ''ఓ తెల్ల కోటు సైనికూడా.. జిందాబాద్ జిందాబాద్.. ఓ ఖాకీ చొక్క రక్షకభటుడా.. జిందాబాద్ జిందాబాద్’’ అనే పాటను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., చేతుల మీదుగా ఆడియో సీడీని లాంచ్ చేసి పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం ఈ పాటను సైబరాబాద్ యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోకిస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ మాట్లాడుతూ.. కోవిడ్ కరోనా కట్టడికి కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ / ముందు వరుసలోని సైనికులందరికీ స్ఫూర్తి అన్నారు.
ర్యాప్ సాంగ్ బయటకు వచ్చేందుకు ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించిన రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి శ్రీ సంతోష్ కుమార్ గారిని సైబరాబాద్ సీపీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.
సమన్వయపర్చిన డాక్టర్ ధీరజ్, ఏడీసీపీ ఎస్ ఓ టి సందీప్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పాటను రచించిన భాస్యశ్రీ, కంపోజ్ చేసిన ర్యాప్ రాక్ షకీల్, పాట పాడిన ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ ఫేమ్ శ్రీరామ చంద్ర ను సీపీ అభినందించారు.
ఇండియన్ ఐడల్ శ్రీరాంచంద్ర మాట్లాడుతూ.. పోలీసులు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, మీడియా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలు కాపాడుతున్నారన్నారు. వారి సేవలకు గుర్తిపుగా ఈ సాంగ్ ను పాడానన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఇచ్చిన సీపీ కి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ పోలీస్, వైద్యులు, మున్సిపల్, మీడియా వల్లనే మనమంతా ఇళ్లలో ప్రశాంతంగా ఉన్నామన్నారు. వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
పాట పోస్టర్ ఆవిష్కరణలో సీపీ గారి వెంట సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపిఎస్, ఏడీసీపీ ఎస్బీ గౌస్ మొహియుద్దీన్, ఎస్ఓటీ ఏడీసీపీ సందీప్, ఏడీసీపీ (అడ్మిన్) లావణ్య ఎన్ జెపీ, ఏసీపీ సంతోష్ కుమార్, ఐటీ ఇన్ స్పెక్టర్ రవీంద్రప్రసాద్ ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







