సౌదీ: రమదాన్ మాసంలో ఇఫ్తార్ భోజనాల కోసం నిధుల కేటాయింపులో పెంపు
- April 24, 2020
పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ కోసం కేటాయించే నిధులను ఈ ఏడాది మరింత పెంచింది సౌదీ ప్రభుత్వం. 18 దేశాల్లో నిర్వహించే ఈ మీల్స్ ప్రాజెక్ట్ కోసం SR5 మిలియన్లను కేటాయించేందుకు సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఆమోదం తెలిపారు. ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రమదాన్ మాసంలో దాదాపు 18 దేశాల్లోని 10 లక్షల మందికి ఇఫ్తార్ భోజనాలను సమకూర్చనున్నారు. అయితే..ప్రతి ఏడాది తరహాలో కాకుండా ఈ సారి ఫుడ్ బాస్కెట్ల రూపంలో ఆహారాన్ని అందించనున్నారు. కరోనా వైరస్ విపత్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆయా దేశాల్లోని ఇస్లామిక్ కేంద్రాలతో సంప్రదింపులు జరిపి ఇఫ్తార్ భోజనాల కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







