మన విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి ఏమన్నారంటే...
- April 24, 2020
ఢిల్లీ:లాక్డౌన్ నేపథ్యంలో వివిధ దేశాల్లోని విమానాశ్రాయాల్లో చిక్కుకుపోయిన భారతీయులు లాక్డౌన్ ముగియనున్న మే 3వ తేదీ వరకు ఓపిక పట్టాలని విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్ విజ్ఞప్తి చేశారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, వారిని వీలైనంత తొందరగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
అమెరికాలో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల గురించి మంత్రిని ప్రశ్నించినప్పుడు.. కరీబియన్ నుంచి న్యూజిలాండ్, ఆస్ట్రేలియ, గల్ఫ్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భారతీయులు చిక్కుకుపోయారని అన్నారు. వారందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రస్తుత పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారని అన్నారు.
ప్రస్తుతం భారత దేశంలో లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో దేశంలోకి ఎవరినీ అనుమతించే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణ నిషేధం ఉందని, కొన్ని జిల్లాలు, చాలా హాట్స్పాట్లను పూర్తిగా సీల్ చేశారని అన్నారు. కాబట్టి మే 3 వరకు ఓపికగా ఉండాలని కోరారు. ఒక్క విద్యార్థులే కాదని, పర్యాటక వీసాలు, వ్యాపార లావాదేవీలపై విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన అందరినీ వెనక్కి తీసుకొస్తామని మురళీధరన్ హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







