అబుధాబి: కరోనా పేషెంట్ల కోసం కేవలం 48 గంటల్లోనే ఆస్పత్రి నిర్మాణం
- April 24, 2020
అబుధాబి:కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు చైనా పది రోజుల్లో ఆస్పత్రిని నిర్మిస్తే..యూఏఈ ప్రభుత్వం కేవలం 48 గంటల్లోనే కొత్త ఆస్పత్రిని నిర్మించింది. అబుదాబిలోని షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో ఈ కొత్త ఆస్పత్రిని నిర్మించారు. 127 పడకల ఈ ఆస్పత్రి సోమవారం వారం నుంచి ప్రారంభం కానుంది. 20 మంది డాక్టర్లు, 85 మంది నర్సులు పేషెంట్లకు సేవలు అందించనున్నారు. రోగుల సంరక్షణ చూసుకునే బంధువుల కోసం 12 ఫ్యామిలి రూమ్స్ కూడా ఉన్నాయి. ఎదైనా అవసరం ఉంటే వైద్య సిబ్బందిని పేషెంట్లు సంప్రదించేలా వీడియో కాలింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. ఆస్పత్రిని కేవలం 48 గంటల్లో నిర్మించటం పట్ల యూఏఈ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. యూఏఈ తలుచకుంటే ఏదీ అసంభవం కాదని షేక్ ఖలిఫా మెడికల్ సిటీ చీఫ్ ఫైనాన్సియర్ ఆఫీసర్ మొహమ్మద్ ఇస్సా అల్ మెహ్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







