2016 ఫిబ్రవరి 24 నుంచి ఆసియా కప్ ట్వంటీ
- January 28, 2016
ఆసియా కప్ ట్వంటీ20 2016 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6వ తేదీ వరకు బంగ్లాదేశ్లో జరగనుంది. తొలిసారి ఆసియా కప్ ఫార్మెట్లో కొన్ని మార్పులు చేశారు. నిజానికి ఆసియా కప్ టోర్నమెంట్లో 50 ఓవర్ల మ్యాచ్లు జరుగుతాయి.అయితే ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో భారత్లో ఐసీసీ వరల్డ్ టీ20 జరగనున్న నేపథ్యంలో ఆసియా కప్లో నిర్వహించే మ్యాచ్లను ట్వంటీ20 ఫార్మెట్లో నిర్వహించనున్నారు. ఆసియా కప్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో పాటు క్వాలిఫయిర్ జట్టు ఇందులో పాల్గొంటున్నాయి.ఆప్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, ఒమన్ ఈ నాలుగు జట్లలో ఏదో ఒక జట్టు క్వాలిఫయిర్గా టోర్నీలో పాల్గొంటుంది. ఈ నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొని ఉంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్, ఇండియా జట్లు తలపడనున్నాయి.ఈ టోర్నీలో మొత్తం 11 మ్యాచ్లు జరగనున్నాయి. దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫిబ్రవరి 27న తలపడనున్నాయి. ఆసియా కప్లో భాగంగా అన్ని మ్యాచ్లు కూడా బంగ్లాదేశ్లోని మిర్పుర్లో ఉన్న షేర్ ఇ బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







