రోగుల సంరక్షణకు అన్ని చర్యలు : నందమూరి బాలకృష్ణ
- April 26, 2020_1587895966.jpg)
రోగుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు, సిబ్బందికి నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ హాస్పిటల్ లోని రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులు, సిబ్బందితో పాటు హాస్పిటల్ లో సేవలందిస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ప్రోత్సాహకంగా ఉండేందుకు నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత భోజనం అందిస్తున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని బాలకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మితుకుమల్లి భరత్, జే ఎస్ ఆర్ ప్రసాద్ తోపాటు పలువురు అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!