మస్కట్: అంతర్జాతీయ మెయిల్ సర్వీసులను ప్రారంభించిన ఒమన్ పోస్ట్
- April 27, 2020
మస్కట్:ఇప్పటి వరకు దేశీయంగానే పోస్టల్, డాక్యుమెంట్స్ పార్శల్ సర్వీసులను అందించిన ఒమన్ పోస్ట్ ఇప్పుడు వినియోగదారుల కోసం అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించింది. ఇంటర్నేషనల్ ప్రిమియమ్ ఎక్స్ ప్రెస్ మెయిల్ పేరుతో ఈ అంతర్జాతీయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి ప్రపంచంలోని దాదాపు 220 ప్రాంతాలకు ఒమన్ పోస్ట్ ద్వారా డాక్యుమెంట్లు, పార్శల్స్ ను పంపించుకోవచ్చని సంస్థ అధికారులు వెల్లడించారు. అయితే..ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని కూడా ఒమన్ పోస్ట్ సీఈవో అబ్ధుల్ మాలిక్ అల్బలుషి ప్రకటించారు. వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం గడ్డుకాలం ముగిసే వరకు http://omanpost.om/booknow/ ద్వారా తమను సంప్రదించాలని అబ్ధుల్ మాలిక్ తెలిపారు. లేదంటే కస్టమర్ సర్వీస్ నెంబర్ 24170444 కు ఫోన్ చేసి బుకింగ్స్ చేసుకోవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







