యూఏఈ : విమానయాన సంస్థలకు భారీగా రీఫండ్ రిక్వెస్టులు

- April 27, 2020 , by Maagulf
యూఏఈ : విమానయాన సంస్థలకు భారీగా రీఫండ్ రిక్వెస్టులు

యూఏఈ పౌర విమానయాన సంస్థలకు తమ టికెట్ల డబ్బులు తిరిగి చెల్లించాలనే ప్రయాణికుల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ కి కలిపి ఇప్పటివరకు 6,70, 000 వేల రిక్వెస్ట్ లు వచ్చినట్లు ఆయా విమానయాన సంస్థల అధికార వర్గాలు వెల్లడించాయి. కరోనా ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దవటంతో..ప్రయాణికుల టికెట్లు కూడా రద్దైన విషయం తెలిసిందే. దీంతో రద్దైన ప్రయాణానికి సంబంధించి టికెట్ల డబ్బు తిరిగి ఇస్తామని విమానయాన సంస్థలు గతంలోనే ప్రకటించాయి. అంతేకాదు..ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నా..ఇప్పటికే చేసుకున్న బుకింగ్ తోనే ప్రయాణం చేయవచ్చని కూడా తెలిపాయి. అయితే..కరోనా సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది ప్రయాణికులు టికెట్ డబ్బులను తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటివరకు తమ దగ్గర 5 లక్షల రిఫండ్ రిక్వెస్ట్ లు పెండింగ్ లో ఉన్నట్లు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ప్రయాణికుల వినుతులను వెంటనే పరిష్కరించే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని సంస్థ అధికారులు వెల్లడించారు. ఆగస్టు కల్లా నగదు చెల్లింపులుగానీ, నగదు బదులు సురక్షితమై వోచర్లను గానీ ఇచ్చే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కస్టమర్లకు అభ్యంతరం లేకుంటే వోచర్లను ఇస్తామని..వాటితో మళ్లి టికెట్లను కొనుక్కోవచ్చని కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇక ఫ్లై దుబాయ్ కి ఇప్పటివరకు లక్షన్నర వినతులు వచ్చినట్లు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తాము క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, అయినా..ప్రతి ప్రయాణికుడికి చిల్లిగవ్వతో సహా చెల్లిస్తామని విమానయాన సంస్థలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com