కోవిడ్-19: భారతీయులను ఇండియాకు తరలించేందుకు సిద్ధమవుతున్న యుద్ధ విమానాలు మరియు నౌకలు

- April 28, 2020 , by Maagulf
కోవిడ్-19: భారతీయులను ఇండియాకు తరలించేందుకు సిద్ధమవుతున్న యుద్ధ విమానాలు మరియు నౌకలు

న్యూఢిల్లీ: COVID-19 మహమ్మారి కొనసాగుతున్నందున గల్ఫ్ దేశాల నుండి భారతీయులను సామూహికంగా తరలించడానికి జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరియు భారత నావికాదళం తమ విమానం మరియు యుద్ధనౌకలతో స్టాండ్బైలో ఉండాలని కోరిన అధికారులు.

భారతీయులు తమ ఇళ్లకు తిరిగి రావడానికి సుముఖత చూపిస్తూ సోషల్ మీడియా మరియు ఈమెయిల్స్ ద్వారా గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. "గల్ఫ్ దేశాల నుండి భారతీయులను తరలించే ప్రణాళికపై చర్చిస్తున్నాము. సుమారు 10 మిలియన్ల మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తుండగా వారిలో చాలామంది పోర్ట్ సిటీలలో నివసిస్తున్నారు, అందువల్ల సముద్ర మార్గాల ద్వారా తరలింపు కోసం సమగ్ర ప్రణాళికను ఇవ్వమని ప్రభుత్వం భారత నావికాదళాన్ని కోరింది. దీనిపై స్పందిస్తూ, నావికాదళం మూడు యుద్ధనౌకలలో 1,500 మంది భారతీయులను గల్ఫ్ దేశాల నుండి తరలించగలదని వివరణ ఇచ్చింది. వివరణాత్మక తరలింపు ప్రణాళిక కోసం మేము ఎయిర్ ఇండియా ను కూడా కోరటం జరిగింది" అని ANI కి తెలిపిన ప్రభుత్వ ఉన్నత వర్గాలు.

"అవసరమైన ఏర్పాట్ల కోసం మేము రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులను ప్రారంభించాము. అలాగే, భారతదేశానికి తిరిగి రావడానికి మరియు వారికి పూర్తి సహాయం అందించడానికి సుముఖత చూపిన వారి కోసం ఒక వివరణాత్మక నివేదికను తయారు చేయమని అన్ని మిషన్లకు కూడా చెప్పబడింది" అంటూ ANI కి తెలిపిన విదేశాంగ మంత్రిత్వ శాఖ. 

గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులలో ఎక్కువమంది కార్మికులు. వారి తరలింపు ఖర్చులను పౌరులు భరించాలా లేక కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా అనే దానిపై చర్చ జరుగుతోందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com