సౌదీ: ప్రవాస భారతీయులకు ఊరట..ఫారం నింపమంటున్న ఎంబసీ
- April 30, 2020
సౌదీ: ప్రవాస భారతీయులకు ఊరట.. భారత్ వెళ్లాలనుకునేవారికి సౌదీలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ కు విమానాలు తిరిగి ప్రారంభించడం పై సమాచారాన్ని కోరుతూ సౌదీ లోని ప్రవాస భారతీయులు చాలామంది రాయబార కార్యాలయానికి కాల్ చేస్తున్నట్టు తెలిపింది.
"ప్రవాస భారతీయులు క్రింద పొందుపరిచిన ఫారం లో తమ వివరాలను నింపాలి. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం సమాచార సేకరణ మాత్రమే. భారత్ కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ విమానాశ్రయం లో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుంది. ఈ ఫారమ్ ఒక సమయంలో ఒక వ్యక్తి కోసం నింపాలి. కుటుంబ సభ్యుల వివరాల కోసం, ప్రతి సభ్యునికి ప్రత్యేక ఫారమ్ నింపాలి. ఫారం నింపిన తర్వాత, ఈ విషయంలో రాయబార కార్యాలయానికి తదుపరి ఇ-మెయిల్ పంపాల్సిన అవసరం లేదు" అని ఎంబసీ అధికారులు తెలిపారు.
భారత్ కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్ సైటు లోని ఈ లింకు ను క్లిక్ చేయాలి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSc_yyVAYPD-VYH98RNOWZkDkGKVsf34qnu0oGoLdtts3RG7_Q/viewform
కరోనాను ఎదుర్కోవటానికి మే 3, 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుంది. కావున, తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులు ఉండవు అని తేల్చి చెప్పిన అధికారులు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







