బహ్రెయిన్:ప్రవాస భారతీయులకు ఊరట..ఫారం నింపమంటున్న ఎంబసీ
- April 30, 2020
మనామా: ప్రవాస భారతీయులకు ఊరట.. భారత్ వెళ్లాలనుకునేవారికి మనామా లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ కు విమానాలు తిరిగి ప్రారంభించడం పై సమాచారాన్ని కోరుతూ బహ్రెయిన్ లోని ప్రవాస భారతీయులు చాలామంది రాయబార కార్యాలయానికి కాల్ చేస్తున్నట్టు తెలిపింది.
"ప్రవాస భారతీయులు క్రింద పొందుపరిచిన ఫారం లో తమ వివరాలను నింపాలి. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం సమాచార సేకరణ మాత్రమే. భారత్ కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ విమానాశ్రయం లో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుంది. ఈ ఫారమ్ ఒక సమయంలో ఒక వ్యక్తి కోసం నింపాలి. కుటుంబ సభ్యుల వివరాల కోసం, ప్రతి సభ్యునికి ప్రత్యేక ఫారమ్ నింపాలి. ఫారం నింపిన తర్వాత, ఈ విషయంలో రాయబార కార్యాలయానికి తదుపరి ఇ-మెయిల్ పంపాల్సిన అవసరం లేదు" అని ఎంబసీ అధికారులు తెలిపారు.
భారత్ కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఎంబసీ వెబ్ సైటు లోని ఈ లింకు ను క్లిక్ చేయాలి.https://docs.google.com/forms/d/e/1FAIpQLScDg2kCuhQ4LPo2zwEYXwNXNeDcAR-22IM0wJCAK4Ok0emo4Q/viewform
కరోనాను ఎదుర్కోవటానికి మే 3, 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుంది. కావున, తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులు ఉండవు అని తేల్చి చెప్పిన అధికారులు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్టు రెన్యువల్‌కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







