యూ.ఏ.ఈ:ప్రవాస భారతీయులకు ఊరట..ఫారం నింపమంటున్న ఎంబసీ
- April 30, 2020
అబుధాబి: ప్రవాస భారతీయులకు ఊరట.. భారత్ వెళ్లాలనుకునేవారికి అబుధాబి లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ కు విమానాలు తిరిగి ప్రారంభించడం పై సమాచారాన్ని కోరుతూ యూ.ఏ.ఈ లోని ప్రవాస భారతీయులు చాలామంది రాయబార కార్యాలయానికి కాల్ చేస్తున్నట్టు తెలిపింది.
"ప్రవాస భారతీయులు క్రింద పొందుపరిచిన ఫారం లో తమ వివరాలను నింపాలి. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం సమాచార సేకరణ మాత్రమే. భారత్ కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ విమానాశ్రయం లో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుంది. ఈ ఫారమ్ ఒక సమయంలో ఒక వ్యక్తి కోసం నింపాలి. కుటుంబ సభ్యుల వివరాల కోసం, ప్రతి సభ్యునికి ప్రత్యేక ఫారమ్ నింపాలి. ఫారం నింపిన తర్వాత, ఈ విషయంలో రాయబార కార్యాలయానికి తదుపరి ఇ-మెయిల్ పంపాల్సిన అవసరం లేదు" అని ఎంబసీ అధికారులు తెలిపారు.
భారత్ కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఈ క్రింద లింకు ను క్లిక్ చేయాలి.https://cgidubai.gov.in/covid_register/
కరోనాను ఎదుర్కోవటానికి మే 3, 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుంది. కావున, తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులు ఉండవు అని తేల్చి చెప్పిన అధికారులు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!