ఉగ్రవాదం పై ఉక్కుపాదం--తెలంగాణా సీఎం

- January 28, 2016 , by Maagulf
ఉగ్రవాదం పై ఉక్కుపాదం--తెలంగాణా సీఎం

ఉగ్రవాదం ఏ రూపంలో రాష్ట్రంలో ఉపేక్షించబోమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దానిని ఉక్కు చేతితో అణచివేస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్బంగా ఇవాళ ఆయన తెలంగాణభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదంపై ఓ విలేకరి ప్రశ్నించగా సీఎం పైవిధంగా స్పందించారు. తెలంగాణలో ఉగ్రవాద, అసాంఘీక శక్తుల ఆటలు సాగనీయబోమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని వివరించారు. లేకుంటే పెట్టుబడులు రావని తెలిపారు. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్ పనులు వేగవంతం చేస్తామన్నారు. దీని ద్వారా శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com