విదేశీ పెట్టుబడిదారులకు 100 శాతం ఓనర్షిప్?
- January 28, 2016
విదేశీ పెట్టుబడిదారులకు ఒమన్లో రెడ్ కార్పెట్ వేయడానికి వీలుగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే 100 శాతం పెట్టుబడితే విదేశీయులు ఒమన్లో వ్యాపార కార్యకలాపాలు చేపట్టవచ్చు. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం కనీసం 35 శాతం వాటా ఒమన్ జాతీయులకు ఉంటేనే విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి వీలుండేది. దాన్ని మార్చి, పెట్టుబడిదారులను ఆకర్షించాలని ఒమన్ ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకర్షించే ప్రయత్నంలో కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పడంలేదని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాల్ని ఒమన్ అనుసరించక తప్పదని వారు అంటున్నారు. విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం ద్వారా దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చినట్లవుతుందని అధికారిక వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులకు 150,000 ఒమర్ రియాల్స్ అనేది మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. కొత్త చట్టాన్ని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆహ్వానిస్తోంది. ఇది దేశ ఆర్థిక ప్రగతికి మేలు చేస్తుందని చాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







