రొయ్యల పులిహోర
- January 28, 2016
కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు (పొట్టు తీసి శుభ్రం చేసినవి) - అరకిలో (చిన్న సైజువి), వేగించిన ధనియాలపొడి - 1 టీ స్పూను, మిరియాలపొడి - అర టీ స్పూను, బియ్యం - అరకిలో, నూనె - అరకప్పు, చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 5, శనగలు (నానబెట్టినవి) - 1 టేబుల్ స్పూను, మెంతులు - అర టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, పసుపుపొడి - అర టీ స్పూను, కరివేపాకు రెబ్బలు -10, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం : రొయ్యలను ఉడికించి నీరు లేకుండా ఆరబెట్టి వాటికి ధనియాల, మిరియాల పొడులతో పాటు తగినంత ఉప్పు పట్టించి పక్కనుంచుకోవాలి. మూడు కప్పుల (గోరువెచ్చటి) నీటిలో చింతపండు నానబెట్టి పులుసు తయారు చేసుకోవాలి. అన్నం (కాస్త పలుకుగా) వండి చల్లార్చుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఎండుమిర్చి, ఆవాలు, శనగలు, కరివేపాకు వేసి నూనెలో దోరగా వేగించి ఆపైన రొయ్యలు కూడా వేసి కాస్త వేగనిచ్చి చింతపండు పులసు కలిపి, ఉప్పును జతచేసి బాగా చిక్కబడేదాకా సన్నని మంటపై ఉడకనివ్వాలి. పులుసు బాగా చల్లారనిచ్చి కొద్దికొద్దిగా అన్నంలో కలపాలి. పులిహోర ముద్ద ముద్దకు ఒక రొయ్య తగిలేలా చూసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







