ఖతార్: ప్రవాస భారతీయులకు ఊరట..ఫారం నింపమంటున్న ఎంబసీ
- May 01, 2020
దోహా:ప్రవాస భారతీయులకు ఊరట.. భారత్ వెళ్లాలనుకునేవారికి దోహా లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ కు విమానాలు తిరిగి ప్రారంభించడం పై సమాచారాన్ని కోరుతూ ఖతార్ లోని ప్రవాస భారతీయులు చాలామంది రాయబార కార్యాలయానికి కాల్ చేస్తున్నట్టు తెలిపింది.
"ప్రవాస భారతీయులు క్రింద పొందుపరిచిన ఫారం లో తమ వివరాలను నింపాలి. ఈ ఫారం యొక్క ఉద్దేశ్యం సమాచార సేకరణ మాత్రమే. భారత్ కు ఎంతమంది వెళ్లాలనుకుంటున్నారు, వారు ఏ విమానాశ్రయం లో దిగాలని అనుకుంటున్నారు అనే ట్రాఫిక్ (రద్దీ) అంచనాకు ఈ డేటా సేకరణ ఉపయోగపడుతుంది. ఈ ఫారమ్ ఒక సమయంలో ఒక వ్యక్తి కోసం నింపాలి. కుటుంబ సభ్యుల వివరాల కోసం, ప్రతి సభ్యునికి ప్రత్యేక ఫారమ్ నింపాలి. ఫారం నింపిన తర్వాత, ఈ విషయంలో రాయబార కార్యాలయానికి తదుపరి ఇ-మెయిల్ పంపాల్సిన అవసరం లేదు" అని ఎంబసీ అధికారులు తెలిపారు.
భారత్ కు వెళ్లాలనుకునే వారు ఆన్ లైన్ ఫారం నింపడానికి ఈ క్రింద లింకు ను క్లిక్ చేయాలి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSftPP5rNta6ZGPih37Os4AqbZnjwCpkIWCbpguTVyRdeADI7w/viewform
కరోనాను ఎదుర్కోవటానికి మే 3, 2020 వరకు భారతదేశం అంతటా పూర్తి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుంది. కావున, తదుపరి ఆదేశాల వరకు విమాన సర్వీసులు ఉండవు అని తేల్చి చెప్పిన అధికారులు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







