విదేశాంగమంత్రి జైశంకర్‌కి వైఎస్ జగన్ లేఖ
- May 02, 2020
అమరావతి:కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని వైఎస్ జగన్ కోరారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, రిజిస్ట్రేషన్ సందర్బంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు.
ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు, విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు సహకరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ వివరాలను రాష్ట్రాలకు అందించాలని, ఫలితంగా తాము వారి క్వారంటైన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, వారికి ఇబ్బందులు లేకుండా ఇండియాకు వచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రికి వైఎస్ జగన్ సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







