నకిలీ మెసేజీలతో రెచ్చిపోతున్న ఘరానా మోసగాళ్లు
- May 03, 2020
అబుధాబి: ఒకవైపు కరోనా తో భయపడుతుంటే, మరోవైపు నకిలీ మెసేజులతో తికమకపడుతున్నారు ప్రజలు. ప్రజలకు వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా 'వాట్సాప్ బహుమతులు, జాబ్ ఆఫర్లు' అంటూ నకిలీ సమాచారాం అందిస్తున్న వైనం అబుధాబి పోలీసులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం ముందుగా ప్రజలను జాగ్రత్త వహించాలంటూ హెచ్చరించింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా క్రిమినల్ ముఠాలు ఇలాంటి నకిలీ సందేశాలను ప్రసారం చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఈ మెసేజ్ పై క్లిక్ చేసి సూచనలను పాటిస్తే చాలు మోసగాళ్ళ ఎరకు బలైనట్టే...మెసేజ్ ద్వారా వచ్చిన ఈ వైరస్ సదరు వ్యక్తి ఫోన్ లోని ఖాతాలను హ్యాక్ చేయటమేకాకుండా ఇతర వ్యక్తిగత వివరాలను యాక్సెస్ చేయగలిగే అవకాశం ఈ మోసగాళ్లకు ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజీలను ఓపెన్ చేయవద్దని తెలియజేస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు మీకు జరిగితే, వెంటనే పోలీస్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ 999, టోల్ ఫ్రీ నంబర్ 8002626 (AMAN2626), టెక్స్ట్ మెసేజ్ ద్వారా 2828, లేదా [email protected] అనే ఇ-మెయిల్ ద్వారా నివేదించాలని ఈ సందర్భంగా అబుధాబి పోలీసులు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







