ఒమన్: ఆన్ లైన్ లో లైసెన్స్ తీసుకోండి..గృహ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోండి!
- May 03, 2020
మస్కట్:ఇళ్లలో చిరు వ్యాపారాలు చేసుకునే వారు తమ వ్యాపార అభివృద్ధికి లైసెన్స్ తీసుకోవటం ఉత్తమమని సూచించింది ఒమన్ ప్రభుత్వం. వినియోగదారల్లో నమ్మకం కలిగించేందుకు లైసెన్స్ గానీ, కమర్షియల్ రిజిస్ట్రేషన్ నెంబర్ గానీ తీసుకోవాలని కోరింది. ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వినియోగదారులకు ప్రభుత్వం పలు సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే. సుల్తానేట్ పరిధిలో ఎవరైనా ఆన్ లైన్ లో ఏదీ కొనాలన్నా..ముందుగా ఆ కంపెనీ రిజిస్టర్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలని ఒమన్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పదే పదే చెబుతోంది. ఇన్వెస్ట్ ఈజీ పోర్టల్ ద్వారా కంపెనీ రిజిస్టర్ అయ్యిందో లేదో తెలుసుకునే అవకాశం ఉందని వినియోగదారుల్లో అవగాహన పెంచుతోంది. ఈ నేపథ్యంలో కుటీర పరిశ్రమల వర్గాలు, ఇళ్లలో చిరు వ్యాపారులు చేసుకునే వారు తమ ఉత్పత్తులపై వినియోగదారుల్లో నమ్మకం కలిగించేందుకు హోమ్ బిజినెస్ లైసెన్స్ గానీ, కమర్షియల్ రిజిస్ట్రేషన్ నెంబర్ గానీ తప్పకుండా తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో వినియోగదారులకు నమ్మకం పెరిగి వ్యాపారం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని సలహా ఇస్తున్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







