కువైట్:సోషల్ మీడియాలో వివక్ష పోస్టులు..భారతీయుడును జాబ్ నుంచి తొలగించిన కంపెనీ

- May 03, 2020 , by Maagulf
కువైట్:సోషల్ మీడియాలో వివక్ష పోస్టులు..భారతీయుడును జాబ్ నుంచి తొలగించిన  కంపెనీ

కువైట్:సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు, అసత్య ప్రచారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు పదే పదే చెబుతున్నా..కొందరు అతివాదులు అదే పొరపాటు చేసి పీకల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇస్లాంకు వ్యతిరేకంగా, తబ్లిగీ జమాత్ ను కించపరుస్తూ పెట్టిన పోస్టు అతని ఉద్యోగానికే ఎసరు పెట్టింది. అంతేకాదు అతనిపై దేశ బహిష్కరణ వేటుకు కూడా కారణమైంది. భారత్ విమానాలు ప్రారంభం అవగానే అతన్ని తిరిగి వెళ్లాల్సిందిగా కువైట్ ఆదేశించింది. మంగళూరుకు చెందిన వ్యక్తి గత 20 ఏళ్లుగా కువైట్ లోని ఓ మల్టి నేషన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. భారత్ లో కరోనా వ్యాప్తిగా తబ్లిగీలే కారణమంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ సెక్షన్ విపరీతమైన ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతను కూడా సోషల్ మీడియాలో ఇస్లాంను కించపరుస్తూ,  తబ్లిగీ జమాత్ పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో విషయం కంపెనీ యాజమాన్యానికి తెలిసింది. దీంతో 20 ఏళ్లుగా జాబ్ చేస్తున్న అతన్ని జాబ్ నుంచి తొలగించటమే కాకుండా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాల్లో ఇస్లాంకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కొంత మంది భారతీయులు ఉద్యోగాలు కొల్పోయారు. హోటల్ సూపర్ వైజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న కార్టూన్ ను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఆ హోటల్ యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. విమాన సర్వీసులు ప్రారంభం అవగానే అతన్ని కూడా దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. మరో ఘటనలో ఫేస్ బుక్ లో ఇస్లాం వ్యతిరేక పోస్టు పెట్టిన మహిళను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆమె తనను క్షమించమంటూ సోషల్ మీడియాలో పెట్టిన వాయిస్ మెసేజ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com