అబుధాబి: సోషల్ మీడియాలో ముష్టి గ్యాంగ్ లు..చర్యల తప్పని హెచ్చరించిన పోలీసులు

- May 03, 2020 , by Maagulf
అబుధాబి: సోషల్ మీడియాలో ముష్టి గ్యాంగ్ లు..చర్యల తప్పని హెచ్చరించిన పోలీసులు

అబుధాబి:పవిత్ర రమదాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తే దేవుడి కృప ఉంటుందనే సెంటిమెంట్ ను క్యాష్‌ చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. అడుక్కోవటం ద్వారా ఈజీగా డబ్బు సంపాదించొచ్చని కక్కుర్తి పడుతున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అబుధాబి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. యూఏఈలో బిచ్చమెత్తుకోవటం నేరమని..ఎవరైనా అడుక్కుంటున్నట్లు కనిపిస్తే అరెస్ట్ చేస్తామని గతంలోనే హెచ్చరించారు. అయితే..పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ ఈజీ మనీ ముఠా కొత్త ఎత్తుగడకు తెరతీసింది. ఏకంగా ఎలక్ట్రానిక్‌ ముష్టికి పాల్పడుతోంది. వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియాతో పాటు ఈ మేయిల్స్‌ ద్వారా బిచ్చమెత్తుకోవటం మొదలు పెట్టారు. కల్లబొల్లి కబుర్లు, జాలి కలిగించేలా దయనీయ కథనాలు అల్లి  దాతల మనస్సు కరిగించే ప్రయత్నం చేస్తారు. రమదాన్‌ మాసం కావటంతో దేవుడి సెంటిమెంట్ ను కూడా ఉపయోగిస్తారు. ఇలాంటి ఆన్‌ లైన్‌ బిచ్చగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అబుధాబి పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా ఈ మెయిల్‌ పంపించినా..వాట్సాప్ కు మెసేజ్‌ పంపించినా వారి వివరాలను 999కి వెంటనే ఫోన్ చేసి కమాండ్ కంట్రోల్‌ రూంకి తెలియజేయాలన్నారు. లేదా టోల్ ఫ్రీ నెంబర్‌ 8002626కి కూడా ఫోన్ చేయొచ్చని పోలీసులు సూచించారు. లేదంటే 2828కి టెక్ట్స్‌ మెసేజ్‌ చేయటంగానీ[email protected]కి మెయిల్‌ చేసినా ఆన్‌ లైన్‌ బిచ్చగాళ్ల బ్యాచ్‌ పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com