కువైట్ : సిబ్బందికి జీతాలు ఇవ్వని 6 ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు మందలింపు

- May 03, 2020 , by Maagulf
కువైట్ : సిబ్బందికి జీతాలు ఇవ్వని 6 ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు మందలింపు

కువైట్ కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వేధించటంపై విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు తమకు జీతాలు ఇవ్వటం లేదని తమకు చాలా ఫిర్యాదులు అందాయని విద్యాశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహించామని, ఆరు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని ఆయన వివరించారు. ఆ ఆరు విద్యా సంస్థల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందలించింది. విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయాలను పాటించని విద్యా సంస్థలపై చర్యలకు ఉపేక్షించబోమని హెచ్చరించింది. అలాగే సిబ్బంది జీతభత్యాలకు సంబంధించి పేరోల్ ను సిద్ధం చేయాలంటూ ప్రైవేట్ స్కూల్స్ సాధారణ పరిపాలన విభాగాన్ని విద్యాశాఖ కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com