ఇరాన్:132 పట్టణాల్లో తెరుచుకోనున్న మసీదులు
- May 03, 2020
టెహ్రాన్:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఇరాన్ పైనా తన ప్రభావం చూపిస్తోంది. ఇరాన్‌లో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల సుమారు 6500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాంతకర వైరస్ లక్ష మందికి పైనే సోకింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఆరోగ్యశాఖ దేశాన్ని మొత్తం మూడు జోన్లుగా విభజించింది. ఇన్‌ఫెక్షన్లు, మరణాల ఆధారంగా ఎల్లో, గ్రీన్, వైట్ జోన్లుగా వేరు చేసింది.
అయితే ప్రస్తుతం రమదాన్ మాసం కావడంతో.. కరోనా వైరస్ కేసులు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మసీదులు తెరిచేందుకు అధ్యక్షుడు హసన్ రౌహనీ అంగీకారం తెలిపారు. సోమవారం నుంచి మసీదులు తెరుచుకోనున్నట్లు ఆయన తెలిపారు. 132 రిస్క్ పట్టణాల్లో.. మసీదులు ప్రార్థనలకు అందుబాటులో ఉంటాయన్నారు. అయితే హెల్త్ ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







