గల్ఫ్ దేశాల నుంచి ఇండియన్స్ ని తరలించాలని ఎలాంటి ఆదేశాలు అందలేదన్న ఎయిర్ ఫోర్స్

- May 04, 2020 , by Maagulf
గల్ఫ్ దేశాల నుంచి ఇండియన్స్ ని తరలించాలని ఎలాంటి ఆదేశాలు అందలేదన్న ఎయిర్ ఫోర్స్

కువైట్:లాక్ డౌన్ తో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించాలని తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని భారత్ వైమానిక దళం తెలిపింది. అయితే..తమకు ఆదేశాలు అందిన వెంటనే తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వైస్ మార్షల్ సురత్ సింగ్ తెలిపారు. ఆదేశాలకు అనుగుణంగా ఏ క్షణంలోనైనా దేశంలోగానీ, విదేశాల్లోగానీ ఆపరేషన్ నిర్వహించేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో నేపాల్ కు కూడా మెడికల్ సప్లైయ్స్ అందజేసినట్లు అయన తెలిపారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ పై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య సిబ్బందికి వైమానిక దళం ఏరియల్ సెల్యూట్ నిర్వహించిందన్నారు. ఇందులో వైమానికదళానికి చెందిన నాలుగు ఎయిర్ క్రాఫ్ట్ లు, 10 యుద్ధవిమానాలు, 15-20 హెలికాఫ్టర్ లు పాల్గొన్నాయన్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com