భారత్:గడచిన 24 గంటల్లో 2553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- May 04, 2020 , by Maagulf
భారత్:గడచిన 24 గంటల్లో 2553 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

భారత దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 2,553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 73 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,533కి చేరింది. ఈ వైరస్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,373 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 29453 యాక్టివ్‌ కేసులు ఉండగా, 11,707 మంది బాధితులు ఈ వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com