ఆరోగ్య సేతు యాప్‌పై కేంద్రం ప్రత్యేక సూచన

- May 06, 2020 , by Maagulf
ఆరోగ్య సేతు యాప్‌పై కేంద్రం ప్రత్యేక సూచన

కరోనా వైరస్‌ని ట్రాక్ చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన యాప్... ఆరోగ్య సేతు యాప్ (Aarogya Setu app). దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని కేంద్రం కోరింది. ఐతే... తాజాగా... ఈ యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాకి ప్రమాదం కలుగుతుందనే ప్రచారం జరగడంతో... ఓ ఎథికల్ హ్యాకర్ (మంచి హ్యాకర్)... స్వయంగా ఈ విషయాన్ని పరిశీలించి... తన రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. దాని ప్రకారం... ఆరోగ్య సేతు యాప్ ద్వారా... ప్రజల వ్యక్తిగత సమాచారం... లీక్ అవ్వదని తేల్చారు. ఐతే... ఆరోగ్య సేతు యాప్‌లో ఉన్న ఓ సెక్యూరిటీ సమస్యను ఆ హ్యాకర్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించింది.

ఎథికల్ హ్యాకర్... అప్రమత్తం చెయ్యడాన్ని కేంద్రం స్వాగతించింది. దేశంలోని ఎవరైనా సరే... ఆరోగ్య సేతు యాప్‌లో ఏవైనా సమస్యలు గుర్తిస్తే... తమ దృష్టికి తేవాలని కోరింది. ప్రజల భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజీ పడే ప్రసక్తే లేదన్న కేంద్రం... ప్రజల వ్యక్తిగత డేటా... లీక్ అవ్వదని హ్యాకర్ చెప్పడాన్ని స్వాగతించింది. ఎథికల్ హ్యాకర్ ఇచ్చిన చిట్కాలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. తద్వారా ఆరోగ్య సేతు యాప్... ఇప్పుడు మరింత భద్రంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com