ఘోర రైలు ప్రమాదం..15మంది వలస కూలీలు మృతి
- May 08, 2020
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మంది వలస కూలీలు మృతి చెందారు. మరణించిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కర్మాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌పై వలస కూలీలు నిద్రస్తుండగా, వారిపై నుంచి గూడ్స్ రైలు వెళ్ళినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారు ట్రాక్‌పై నిద్రకు ఉపక్రమించారు. కాగా జల్నా-ఔరంగాబాద్ మధ్య నడిచే గూడ్స్ రైలు వీరు నిద్రిస్తున్న ట్రాక్‌పై నుంచి పోవడంతో కూలీలంతా అక్కడికక్కడే మరణించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







