కువైట్:కరోనా డాక్టర్ మృతి..సంతాపం ప్రకటించిన ఆరోగ్యశాఖ మంత్రి
- May 09, 2020_1589000285.jpg)
కువైట్:కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ కువైట్ లో ఓ డాక్టర్ ప్రాణాలు కొల్పోయారు. ఈజిప్ట్ కు చెందిన డాక్టర్ తారీక్ హుస్సేన్ ముఖైమర్ కువైట్ జైన్ ఆస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో విధులు నిర్వహించేవారు. కొద్ది రోజులుగా కరోనా విభాగంలో సేవలు చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు డాక్టర్ కూడా వైరస్ బారిన పడటంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కరోనా కారణంగా కువైట్ లో కన్నుమూసిన తొలి డాక్టర్ ఇతనే. డాక్టర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ షేక్ బాసిల్ అల్ సాబా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ తారీక్ మృతి పట్ల కువైట్ లోని ఈజిప్ట్ రాయబారి తరెక్ ఎల్ ఖువౌని డాక్టర్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కరోనా బాధితులకు సేవ చేస్తూ ప్రాణాలు త్యాగం చేసిన డాక్టర్ తారీక్ సేవలను కొనియాడారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..