హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం 100,000 ఉచిత టిక్కట్లు: ఖతార్ ఎయిర్ వేస్

- May 12, 2020 , by Maagulf
హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం 100,000 ఉచిత టిక్కట్లు: ఖతార్ ఎయిర్ వేస్

ఖతార్ ఎయిర్ వేస్, కరోనా వైరస్ నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నహెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం 100,000 టిక్కట్లను ఉచితంగా అందించనుంది. రీపాట్రియేషన్ చర్యలు ముమ్మరం కావడంతో, ఈ కార్యక్రమంలో ఖతార్ ఎయిర్ వేస్ కీలక భూమిక పోషిస్తోంది.హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఉచిత టిక్కట్లను పొందడానికి వీలుగా ప్రత్యేక పేజీని తమ వెబ్ సైట్ లో అందుబాటులోకి తెచ్చింది ఖతార్ ఎయిర్ వేస్. ముందుగా వచ్చినవారికి ముందుగా.. అనే కాన్సెప్ట్ ఈ ఆఫర్ కోసం వర్తింపజేస్తున్నారు. డాక్టర్లు, మెడికల్ ప్రాక్టీషనర్లు, నర్సులు, పారామెడిక్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు.. అలాగే క్లినికల్ రీసెర్చర్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఎంప్లాయర్ ఐడీ తప్పనిసరి. ప్రతిరోజూ టిక్కట్ల కేటాయింపు అర్థరాత్రి నుంచి ప్రారంభమవుతుంది. నవంబర్ 26 లోపు టిక్కెట్లను బుక్ చేసుకుంటే, డిసెంబర్ 10 వరకు ఈ టిక్కెట్లపై ప్రయాణించే వీలుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com