లండన్ నుండి న్యూయార్క్ కి 11 నిమిషాలలో..!!!
- January 29, 2016
సాధారణంగా లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవడానికి సాధారణంగా ఎనిమిది గంటలు పడుతుంది. అయితే మీరు మాత్రం ఇప్పుడు కేవలం 11 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ వార్తను నమ్మలేకపోతున్నారా? నిజమేనండి. స్క్రీమర్ ను మించిన హైపర్ సోనిక్ విమానం వచ్చేస్తోంది. స్ర్కీమర్ కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోయే హైపర్ సోనిక్ విమానం వచ్చేస్తోంది.గత ఏడాది నవంబర్ లో స్ర్కీమర్ తో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన కెనెడా ఇంజినీర్ ఛార్లెస్ బంబార్డియర్ సంస్థే ఈ విమానాన్ని రూపొందించింది.
దీంతో లండన్ నుంచి న్యూయార్క్ కు కేవలం పదకొండు నిమిషాల్లో ల్యాండ్ అవ్వొచ్చు. ఈ విషయాన్ని బంబార్డియన్ తన అధికారిక వెబ్ సైట్లో తెలిపింది. 20 వేల కిలోమీటర్ల వేగాన్ని కేవలం గంట వ్యవధి లోపు లోనే చేరుకోవచ్చని ఇంజనీర్ చార్లెస్ బంబార్డియర్ ఘంటా పథంగా చెబుతున్నారు.స్క్రీమర్ విమానం కంటే ఇది రెట్టింపు వేగంతో ప్రయాణించగలదని చెబుతున్నారు. దీంతోపాటుగా యుద్ధ విమానాల కంటే దాదాపు 12 రెట్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. 10 మంది ఈ విమానంలో ప్రయాణించే సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికైనా, ఏ సమయంలో అయినా లక్ష్యాన్ని అతి త్వరలో చేరుకునేందుకు మిలిటరీ అధికారులకు ఇది బాగా ఉపయోగపడుతుందని బంబార్డియర్ తెలిపారు.కాగా గత ఏడాది ఇంజినీర్ ఛార్లెస్ బంబార్డియర్ ఆధ్వర్యంలో స్క్రీమర్ విమానం గంటకు ఏకంగా 7673 మైళ్ల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. 75 మంది ప్రయాణించే సామర్ధ్యం కలిగిన ఈ స్క్రీమర్ నాలుగు వేల మైళ్ల అట్లాంటిక్ మహా సముద్రాన్ని అరగంటలో అధిగమిస్తుందని అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







