దుబాయ్:బిల్డింగ్ పై నుంచి కిందపడి 12వ గ్రేడ్ విద్యార్ధి మృతి
- May 13, 2020
దుబాయ్ లోని వార్సన్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి కింద పడి 12వ గ్రేడ్ విద్యార్ధి మృతి చెందాడు. బాల్కానీలో అన్నాదమ్ములు ఆడుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. సమాచారం తెల్సుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, అయితే..అప్పటికే అతను మృతిచెందాడని తెలిపారు. బాల్కనీలో తన సోదరుడితో కలిసి ఫుట్ బాల్ ఆడుకుంటూ ఉండగా...బాల్ కింద పడిందని, బాల్ ను పట్టుకునే క్రమంలో మృతుడు ప్రమాదవశాత్తు కిందపడినట్లు వివరించారు. ఈ ఘటన నేపథ్యంలో తల్లిదండ్రుల తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండాల్సి రావటంతో పిల్లలు బోర్ కొట్టి ఆటలు ఆడే అవకాశాలు లేకపోలేదని..అలాంటి వారి పట్ల తల్లిదండ్రులు అప్రమత్తం ఉండాలన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







