సోయాబీన్‌తో బిర్యానీ

- January 29, 2016 , by Maagulf
సోయాబీన్‌తో బిర్యానీ

కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం - 1 కప్పు, సోయా గ్రాన్యూవల్స్‌ - 1 కప్పు, షాజీరా - 1 టీ స్పూను, గరం మసాల, దనియాల పొడి - అర టీ స్పూను చొప్పున, పసుపు - చిటికెడు, పచ్చిబఠాణీలు - అరకప్పు, ఉల్లిపాయ - 1, టమోటాలు - 2, అల్లం - అంగుళం ముక్క, వెలుల్లి - 3 రేకలు, పచ్చిమిర్చి - 2, బిర్యాని ఆకు - 1, పల్లీలు - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర, పుదీనా - అలంకరణకు తగినంత.
 

తయారుచేసే విధానం: నెయ్యిలో మొదట షాజీరా, బిర్యాని ఆకు, ఉల్లి తరుగు వేసి వేగించాలి. తర్వాత టమోటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు, గరం మసాల, దనియాల పొడి, పసుపు వేసి కొద్దిసేపు వేగించాలి. ఇప్పుడు (నానబెట్టి, నీరు పిండిన) గ్రాన్యూవల్స్‌+బియ్యం+ ఉప్పు వేసి కలిపి 2 నిమిషాల తర్వాత రెండున్నర కప్పుల నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి. కొద్దిగా నీరు ఉన్నప్పుడే పచ్చిబఠాణీ కలిపి, దించేముందు పల్లీలు, కొత్తిమీర + పుదీనా తరుగు చల్లాలి. వేడి వేడిగా రైతాతో తింటే బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com