రామ్ చరణ్ చేతి లో రెండు సినిమా లు
- January 29, 2016
రామ్‌చరణ్ మంచి దూకుడు మీద ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే, ఏకంగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 'బ్రూస్‌లీ' తర్వాత తమిళ హిట్ 'తని ఒరువన్' తెలుగు రీమేక్‌లో నటించడా నికి రామ్‌చరణ్ అంగీకరించిన విషయం తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది. ఇప్పుడు చెర్రీ మరో చిత్రానికి పచ్చజెండా ఊపారని సమాచారం. ఇంటెలిజెంట్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు. ఓ అగ్రనిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరి.. 'తని ఒరువన్' రీమేక్‌తో పాటు సుక్కు చేయబోయే చిత్రం కూడా సెట్స్‌కి వెళుతుందా?ఆ చిత్రం షూటింగ్ సగం పూర్తయ్యాక ఈ చిత్రాన్ని మొదలుపెడతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఒక సినిమా తర్వాత మరొకటి చేసినా మరో ఏడాదిలో ఈ రెండు చిత్రాలూ విడుదలయ్యే అవకాశం ఉందని ఊహించవచ్చు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







