దుబాయ్:1990-2020 మధ్య పని చేసిన వారికి Dh4,000 వస్తాయంటూ అసత్య ప్రచారం
- May 16, 2020
దుబాయ్:మీరు 1990-2020 మధ్య పని చేశారా? అయితే..మీకు కార్మిక శాఖ ఖాతాలో నుంచి Dh4,000 విత్ డ్రా చేసుకునేందుకు అర్హులు. మీరు కేవలం కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబితే చాలు ఖాతా నుంచి డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. వాట్సాప్ లో ఈ తరహా ప్రచారం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే..ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కార్మిక శాఖ స్పష్టం చేసింది. కార్మిక శాఖ అలాంటి సందేశాలను పంపించటం లేదని..అది శుద్ధ అసత్య ప్రచారమని తేల్చి చెప్పింది. వాట్సాప్ కు ఓ యూఆర్ఎల్ అడ్రస్ లింక్ పంపించి దానిని క్లిక్ చేయటం ద్వారా వారి పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సిందిగా సూచిస్తుంది. labour.rebajaslive.com ద్వారా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతుంది. ఆ తర్వాత మీరు కార్మిక శాఖ నుంచి Dh4,000 విత్ డ్రా చేసుకునేందుకు పూర్తిగా అర్హులుగా నిర్ధారిస్తుంది. అయితే..అందుకు కొన్ని షరతులను కూడా నిర్దేశిస్తూ...వాట్సాప్ లో 20 మందికి లింక్ ను షేర్ చేయాలంటూ కండీషన్ పెడుతుంది. తీరా వాళ్లు పంపించిన లింకులను క్లిక్ చేసినా ఏమి ప్రయోజనం ఉండదు. పైగా మాల్ వేర్ ఎటాక్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ప్రచారం యూఏఈలోనే కాదు..ఇండియాలోనూ జోరుగా జరుగుతోంది. కార్మిక శాఖ నుంచి Rs120,000 విత్ డ్రా చేసుకోవచ్చనే హామీతో వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారు. అయితే..భారత ప్రభుత్వం ఈ ప్రచారంలో పూర్తిగా అసత్యమని కొట్టిపారేసింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..