ఈపీ మున్సిపాలిటీలో సెల్ఫ్ శానిటైజేషన్ వాహనాలు ప్రారంభం
- May 16, 2020
దమ్మమ్:కరోనా కట్టడికి సౌదీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతుగా తూర్పు ప్రావిన్స్ మున్సిపాలిటీ క్రిమిసంహారక చర్య(శానిటైజేషన్) ను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో సెల్ఫ్ శానిటైజేషన్ వాహనాలను ప్రారంభించింది. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన ఈ సెల్ఫ్ శానిటైజేషన్ మిషన్ తో సెకండ్ కు 2 లీటర్ల రసాయానాలను స్ప్రే చేయవచ్చు. ఒక్కో వాహనం 5 మీటర్ల ఎత్తు, 7 మీటర్ల వెడల్పు ఉంటుంది. వాహనానికి 16 చదరపు మీటర్ల ట్యాంక్ బిగించి ఉంటుంది. వాహనంలోని అత్యాధునిక సాంకేతికతో దానంతంట అదే వీధులను శానిటైజ్ చేస్తూ వెళ్తుంది. తొలిగా దీన్ని దమ్మమ్ స్ట్రీట్ లో ప్రారంభించారు. త్వరలోనే ఇలాంటి వాహనాలను మరిన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో శానిటైజ్ చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







