కువైట్: పార్కింగ్ స్థలాన్ని కోవిడ్ డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్ గా మార్చిన జజీరా ఎయిర్ వేస్
- May 18, 2020
కువైట్:కోవిడ్ పై అలుపెరగకుండా పోరాడుతున్న కువైట్ ప్రభుత్వానికి తన వంతు తోడ్పాటు అందిస్తోంది జజీరా ఎయిర్ వేస్. సంస్థకు చెందిన పార్క్ అండ్ ఫ్లై స్థలాన్ని కోవిడ్ డ్రైవ్ త్రూ పరీక్షా కేంద్రంగా మార్చి కువైట్ ప్రభుత్వానికి అప్పగించింది. (డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్ ద్వారా ఎవరైనా వ్యక్తులు తమ కార్లలోనే నేరుగా పరీక్షా కేంద్రానికి వచ్చి కారు దిగకుండానే శాంపుల్స్ ఇచ్చి వెళ్లేలా ఏర్పాట్లు ఉంటాయి) జజీరా కేవలం రికార్డ్ సమయంలోనే పార్కింగ్ స్థలాన్ని పరీక్ష కేంద్రానికి అనుగుణంగా తీర్చిదిద్ది..ఆరోగ్యశాఖకు అప్పగించింది. ఈ సందర్భంగా జజీరా ఎయిర్ వేస్ చైర్మన్ మర్వాన్ బూడై మాట్లాడుతూ..కోవిడ్ నిర్ధారణ వైద్య పరీక్షలకు, ఆరోగ్య శాఖకు అనువుగా పరికరాలను అమర్చుకోవటానికి తమ సంస్థకు చెందిన పార్క్ అండ్ ఫ్లై స్థలం చాలా అనువుగా ఉంటుందన్నారు. కోవిడ్ పై పోరాటంలో నిర్విరామంగా పోరాడుతున్న కువైట్ ప్రయత్నాల్లో మా సంస్థను కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన అన్నారు. అంతేకాదు తమ సంస్థ తరపున రెండో డ్రైవ్ త్రూ టెస్టింగ్ సెంటర్ ను కూడా రూపొందిస్తున్నామని వెల్లడించారు. జబేర్ అల్ అహ్మద్ జాతీయ స్టేడియంలో డ్రైవింగ్ త్రూ పరీక్ష కేంద్రాన్ని తమ ఇంజనీరింగ్ బృందం సిద్ధం చేసి ఆరోగ్యశాఖకు అప్పగిస్తుందని ఆయన తెలిపారు. అయితే..పరీక్షా కేంద్రాల ఏర్పాటు వరకే తాము భాగస్వామ్యులం అవుతామని..వైద్య పరీక్షల నిర్వహణ అంతా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుందని జజీరా ఎయిర్ వేస్ చైర్మన్ అన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







