మే 31 వరకు లాక్డౌన్:కేసీఆర్
- May 18, 2020
హైదరాబాద్:కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో కూడా లాక్డౌన్ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా.. మిగతావన్నీ గ్రీన్జోన్లేనని పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు అని తెలిపారు. హైదరాబాద్లో GHMC కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు.1,452 కుటుంబాలకు కట్టడి ప్రాంతాల్లో ఉన్నాయని, కట్టడి ప్రాంతాల్లోని ప్రజలంతా సహకరించాలని కేసీఆర్ కోరారు. కరోనాకు వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని, కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







