కువైట్లో భూకంపం, 7.0 తీవ్రతతో రష్యాని కుదిపేసిన భూకంపం
- January 29, 2016
కబ్ద్ మరియు సౌత్ జహ్రాలో శుక్రవారం రెండు సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. కైవట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, నేషనల్ నెట్వర్క్ ఫర్ మానిటరింగ్ ఎర్త్ క్వేక్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. 5.2, 3.7 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని డైరెక్టర్ అబ్దుల్లా అల్ ఎనిజి చెప్పారు. ఐదు కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. జమ్రా, కైరవాన్ మరియు సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతాల్లో భూప్రకంపనలు గుర్తింపబడ్డాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా తూర్పు రష్యాల 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. 153 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. సునామీ వచ్చే అవకాశాల్లేవని నేషనల్ అండ్ పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రాలు ధృవీకరించాయి.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







