నేడు హైదరాబాద్ లో కే.సి.ఆర్ బహిరంగ సభ

- January 29, 2016 , by Maagulf
నేడు హైదరాబాద్ లో కే.సి.ఆర్ బహిరంగ సభ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన పర్యవేక్షించారు. తెరాస అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి తెరాస ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి మొత్తంగా లక్ష మందిని సమీకరించేందుకు చర్యలు చేపట్టింది. బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లను చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, ఉత్తర మండలం డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పరేడ్‌ మైదానంలో భద్రత చర్యల్ని సమీక్షించారు. మొత్తం 2వేల మందితో భద్రత చేపట్టనున్నట్లు కమిషనర్‌ తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు వచ్చే ప్రజల వాహనాలు నిలిపేందుకు సంజీవయ్య పార్క్‌, బల్కంపేట ఫ్లైఓవర్‌, బేగంపేట విమానాశ్రయం, రైల్‌నిలయం ఆర్‌ఆర్‌సీ మైదానం, తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల, దోభీఘాట్‌, అల్వాల్‌ కూరగాయల మార్కెట్‌.. తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com