రామ్ గోపాల్ వర్మ నెక్ట్స్ ప్రాజెక్ట్ .'గవర్నమెంట్'..
- January 29, 2016
వీరప్పన్ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ నార్త్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టాడు. కొంత కాలంగా సౌత్ లో సినిమాలు చేస్తున్న వర్మ, వీరప్పన్ సినిమా తరువాత బాలీవుడ్ వెళ్లిపోయాడు. వీరప్పన్ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో భారీగా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను కూడా ఎనౌన్స్ చేశాడు.'గవర్నమెంట్' పేరుతో వర్మ తెరకెక్కించనున్న ఈ సినిమాలో మరోసారి తనకు బాగా పట్టున్న అండర్ వరల్డ్ నేపథ్యాన్ని తీసుకోనున్నాడు. అయితే తన గత సినిమాల మాదిరిగా రాసుకున్న కథతో కాకుండా ముంబై మాఫియాలో నిజంగా జరిగిన పరిణామాలను ఈ సినిమాకు కథగా ఎంచుకున్నాడు.వీరప్పన్ సినిమాను తీసినంత రియలిస్టిక్ గా ముంబై మాఫియా నేపథ్యాన్ని వెండితెర మీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు.ముఖ్యంగా గవర్నమెంట్ సినిమాలో దావూద్ ఇబ్రహీం, చోటారాజన్ ల స్నేహం, తరువాత వారి మధ్య మనస్పర్థలు రావటం. దావూద్ కు తీవ్రవాదులు, ఐయస్ ఐతో ఉన్న సంబంధాలు, అండర్ వరల్డ్ మాఫియాకు ముంబై రాజకీయాలకు, పోలీస్ వ్యవస్థకు ఉన్న రిలేషన్స్ గురించి చూపించనున్నాడట. తను ప్రతి సినిమాను వివాదాస్పదం చేసే వర్మ ఇలాంటి వివాదాస్పద కథను ఎంచుకొని ఇంకెన్ని వివాదాలకు తెర తీస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







