జాతిపితకు ఘన నివాళి.
- January 30, 2016
జాతిపిత మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, త్రివిధ దళాధిపతులు రాజ్ ఘాట్ లో నివాళులు అర్పించారు. గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి, రెండు నిమిషాలపాటూ మౌనం వహించారు.మరో వైపు హైదరాబాద్ లో బాపూ ఘాట్ లో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా రెండు నిమిషాల పాటూ మౌనం పాటించారు.వాహనదారుల కోసం అన్ని ట్రాఫిక్ సిగ్నల్ లను 11 గంటలనుంచి రెండు నిమిషాలు రెడ్ సిగ్నల్ వేయడంతో ప్రయాణికులు కూడా అమరవీరులలకు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







