నేడు హైదరాబాద్ లో కే.సి.ఆర్ బహిరంగ సభ
- January 29, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన పర్యవేక్షించారు. తెరాస అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి తెరాస ఏర్పాట్లు చేసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి మొత్తంగా లక్ష మందిని సమీకరించేందుకు చర్యలు చేపట్టింది. బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లను చేశారు. నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఉత్తర మండలం డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పరేడ్ మైదానంలో భద్రత చర్యల్ని సమీక్షించారు. మొత్తం 2వేల మందితో భద్రత చేపట్టనున్నట్లు కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు వచ్చే ప్రజల వాహనాలు నిలిపేందుకు సంజీవయ్య పార్క్, బల్కంపేట ఫ్లైఓవర్, బేగంపేట విమానాశ్రయం, రైల్‌నిలయం ఆర్ఆర్సీ మైదానం, తార్నాక రైల్వే డిగ్రీ కళాశాల, దోభీఘాట్, అల్వాల్ కూరగాయల మార్కెట్.. తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







