తొలి ఎపిసోడ్‌కు కంటిన్యుయేషన్‌గా సెకండ్ ఎపిసోడ్ ముద్దపప్పు ఆవకాయ..
- January 30, 2016
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్‌ను మొదలు పెట్టిన నిహారిక తాజాగా ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్‌లో ఎపిసోడ్-2 ను విడుదల చేసారు. మొదటి ఎపిసోడ్ ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదల కాగా, ఆ వీడియోను దాదాపు 5 లక్షలకు పైగానే వీక్షించారు. తొలి ఎపిసోడ్‌కు కంటిన్యుయేషన్‌గా సెకండ్ ఎపిసోడ్ ఉండగా, ఎపిసోడ్ 2 కూడా నెటిజన్లను మరింత ఆకర్షిస్తోంది.ముద్దపప్పు ఆవకాయ పేరుతో తెరకెక్కిన ఈ ఎపిసోడ్‌కు ప్రణీత్ బ్రమందపల్లి దర్శకత్వం వహించగా, ఇందులో నిహారికకు జోడిగా ప్రతాప్ నటిస్తున్నారు. నిహారిక నటనకు మెగా అభిమానులు జేజేలు పలుకుతుండగా, ప్రతాప్ నటన కూడా ప్రేక్షకులు ఆకట్టుకునేలా ఉంది. ఇక వర్ష, అదితి, హర్ష, మోహన్, ధనలక్ష్మి, లీరిషా, హుస్సేన్ షా కిరణ్, సంజీవ్, సంజన, వింధ్య తదితరులు వారి వారి పాత్రలలో నటించి మెప్పించారు.మరి ముద్దపప్పు ఆవకాయ వెబ్‌సిరీస్‌లో విడుదలైన రెండవ ఎపిసోడ్‌పై మీరు ఓ లుక్కేయండి
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







