యూఏఈ కార్మికుల రీపాట్రియేషన్: చార్టర్ విమానాలకు అనుమతిచ్చిన ఇండియా
- May 23, 2020
దుబాయ్: యూఏఈ, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సీ ఫేరర్స్ సహా తమ ఉద్యోగుల్ని చార్టర్డ్ విమానాల్లో రప్పించడానికి కంపెనీలకు అనుమతినిచ్చింది. భారత హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక మెమొరాండమ్ ని విడుదల చేసింది. వందే భారత్ మిషన్ మే 23వ తేదీతో ముగియనున్న దరిమిలా, ఈ కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, చార్టర్ విమానాల్లో తమ ఉద్యోగుల్ని తరలించేందుకు సిద్ధంగా వున్న కంపెనీలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పారు. ట్రావెలర్ లేదా సదరు కంపెనీ ప్రయాణ ఖర్చుల్ని భరించాలని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. 12,000 మంది ఉద్యోగుల తరలింపుకు సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే వెళ్ళాయి. ఇదిలా వుంటే ఓసీఐ కార్డ్ దారుల కోసం వీసా మరియు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్‌లో కొన్ని సడలింపులు ఇచ్చారు. ఓసీఐ కార్డులున్న భారత జాతీయులకు జన్మించినవారు, ఫ్యామిలీ ఎమర్జన్సీతో ఇండియాకి రావాలనుకుంటున్న ఓసీఐ కార్డుదారులు, ఒకరికి ఐసీఐ కార్డు వుండి, మరొకరు భారత జాతీయులైన భార్యాభర్తలు, ఓసీఐ కార్డుదారులైన యూనివర్సిటీ స్టూడెంట్స్ (తల్లిదండ్రులు భారతదేశంలో పర్మనెంట్ రెసిడెంట్స్ అయితే) స్వదేశానికి వచ్చేందుకు భారత ప్రభుత్వం వీలు కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







